ETV Bharat / state

పంట నష్ట నివేదికలు చేరాయి... నిధుల విడుదలే తరువాయి.... - chittoor updates

వరుస తుపాన్లతో చిత్తూరు జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలను అధికారులు నిర్ధారించారు. వారికి పెట్టుబడి రాయితీని అందిచేందుకు నివేదికలు తయారుచేసి.. కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదించారు. నిధులు రాగానే రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని సంబంధిత శాఖల అధికారులు తెలిపారు.

crop loss
పంట నష్టం నివేదిక
author img

By

Published : Dec 16, 2020, 1:09 PM IST

నివర్‌, బురేవీ తుపాన్ల ప్రభావంతో చిత్తూరు జిల్లాలోని రైతాంగం తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది. ఎడతెరపి లేని వర్షాలు పంట పొలాలను ముంచెత్తాయి. 33 శాతానికి మించి నష్టపోయిన పంటల వివరాలను సేకరించారు. 12,343 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు 41,704 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు నిర్ధరించారు. వీరికి పెట్టుబడి రాయితీగా రూ.20.05 కోట్లు మంజూరు చేసేందుకు నివేదికలు సిద్ధం చేశారు. వీటిని జిల్లా పాలనాధికారి నారాయణ భరత్‌ గుప్తా ఆమోదంతో ప్రభుత్వానికి నివేదించారు.

10,020 హెక్టార్లలో వ్యవసాయ పంటలు

వరుస తుపాన్లతో 10,020 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. వరి, వేరుసెనగ, మొక్కజొన్న, ఉద్దుల పంటలు నీట మునగడంతో 35,511 మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. వీరికి పెట్టుబడి రాయితీగా రూ.14.99 కోట్లు మంజూరుకు ప్రభుత్వానికి నివేదికలు పంపామని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్‌ తెలిపారు.

2,323 హెక్టార్లలో ఉద్యాన పంటలు

ఇటీవల కురిసిన వర్షాలకు ఉద్యానపంటలూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2,323 హెక్టార్లలోని మామిడి, టమోటా, కూరగాయలు, పూలు, పండ్ల తోటలకు నష్టం వాటిల్లడంతో 6,193 మందికి పరిహారం అందించేందుకు ఉద్యాన శాఖ అధికారులు లెక్కతేల్చారు. నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.5.51 కోట్లు మంజూరుకు ప్రభుత్వానికి నివేదించామని ఉద్యాన శాఖ డీడీ శ్రీనివాసులు తెలిపారు. నిధులు రాగానే రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని సంబంధిత శాఖల అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి : 'ఆయుర్వేద ఆస్పత్రి హోదా పెంచండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.