చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రీపోలింగ్ నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. దీనిపై పార్టీ నాయకులతో చర్చించారు. తాము రీపోలింగ్‌కు అడిగిన బూత్‌లను ఈసీ పరిగణనలోకి తీసుకోకపోవడంపై మండిపడ్డారు. వైకాపా అడిగిన 7 బూత్‌లలో ఐదింటికి ఎన్నికలు జరపడం సరికాదన్నారు. నిబంధనల ప్రకారం తాము అడిగిన వాటిలోనూ మళ్లీ పోలింగ్ జరపాలని కోరారు. ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణి మరోసారి రుజువైందని అభిప్రాయపడ్డారు. రీపోలింగ్‌పై ఈసీకి లేఖ రాయాలని నిర్ణయించారు.
ఇవీ చదవండి..