చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయాన్ని ఉదయం 7 గంటలకు మూసివేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. పారంపర్యంగా ఆలయంలో అభిషేక సేవ నిర్వహిస్తున్న కుటుంబానికి చెందిన అఖిలమ్మ (70) అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో అర్చకులు, అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తయ్యాక.. సాయంత్రం 6 గంటలకు ఆలయ శుద్ధి చేస్తామని పండితులు పేర్కొన్నారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. మరోవైపు.. ఈ విషయం తెలియక ఆలయానికి వచ్చిన భక్తులు వెనుదిరిగారు.
ఇదీ చదవండి: వెంకటేశ్వర శిల్ప కళాశాలను సందర్శించిన తితిదే ఈవో