తిరుపతిలో ఓ దంపతులు నృత్య పాఠశాలను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో స్థానికులతో పాటు వివిధ దేశాల వారికి ఆన్‌లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నారు. పట్టణంలోని విద్యార్థులు 25 మంది ఆన్‌లైన్ ద్వారా సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు శిక్షణ పొందుతున్నారు.
సమయం సద్వినియోగం..
తేజస్విని తల్లిదండ్రులు కృష్ణకుమార్, కవిత ప్రోత్సాహంతో ఆరేళ్ల వయసు నుంచే భరతనాట్యంలో శిక్షణ పొందుతోంది. ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. ఇప్పటివరకు శ్రీలంకలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఇటీవల కళా అవార్డుల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రతినెల కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపకార వేతనం పొందుతోంది. ‘
కరోనా కారణంగా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే అన్నీ మరచిపోతాం. అందువల్లే ఆన్‌లైన్ నృత్య తరగతులకు హాజరయ్యాను. అర్థం కాని సమయంలో మరోసారి అడిగితెలుసుకుంటున్నా -తేజస్విని
లాక్‌డౌన్‌లో కొత్త అనుభూతి..
మేఘశ్రీ తల్లిదండ్రులు వైద్యులు. ఏడేళ్ల వయసు నుంచే నాట్యంలో శిక్షణ పొందుతోంది. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న విద్యార్థిని జాతీయ స్థాయి ప్రదర్శనలతో పాటు హైదరాబాద్‌లో జరిగిన గిన్నిస్ బక్ ఆఫ్ రికార్డులో పాల్గొంది. ‘
లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్ శిక్షణ కొత్త అనుభూతి ఇస్తోంది. కొన్నికొన్ని భంగిమలు నేరుగా నేర్చుకుంటేనే త్వరగా వస్తాయి. అయినా ఒకటికి మూడు నాలుగుసార్లు చూసి నేర్చుకుంటున్నా - మేఘశ్రీ.
కొత్తకొత్తగా..
సరయు ప్రస్తుతం డిగ్రీ మైక్రోబయాలజీ చదువుతోంది. బెంగళూరులో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటాలని లాక్‌డౌన్ సమయంలో సాధన చేస్తోంది.‘
ఇప్పుడంతా కొత్తగా అనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో కళాశాల పాఠాలు వింటూ..నృత్య తరగతులు కూడా హాజరవుతున్న. ఇష్టమైన రంగంలో రాణించాలంటే ఇలాంటి కొత్త ఆలోచనలతోనే ముందుకెళ్లాలి. అర్థం కాని సమయంలో మళ్లీ మళ్లీ సాధన చేయాల్సి వస్తుంది - సరయు.
ఇదీ చదవండి: