చిత్తూరులో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే వరదనీటి కోసం రెండు గ్రామాల మధ్య వివాదం నెలకొంది. యాదమరి మండలం పాతపాళ్యం, బంగారు పాళ్యం మండలం మహాసముద్రం గ్రామాల మధ్య వాననీటి కోసం వివాదం నెలకొంది. పాతపాళ్యం సమీపంలో ఉన్న గూటాలవంక చెరువులో ఉన్న నీటిని మహాసముద్రం చెరువుకు తరలించేందుకు మహా సముద్రం గ్రామస్థులు యత్నించారు. గూటాలవంక చెరువు అలుగు పగులగొట్టి వర్షపునీటిని తరలించేందుకు ప్రయత్నించగా... పెద్దపాళ్యం గ్రామస్థులు అడ్డుకొన్నారు.
పోలీసులు పట్టించుకోలేదు
చెరువు అలుగు పగులగొట్టడం ద్వారా తమ చెరువులో ఉన్న నీరు పూర్తిగా వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు అలుగు పగులగొడుతున్నా పోలీసులు పట్టించుకోకపోవటంతో నిరసన వ్యక్తం చేశారు. తమ చెరువులో నీరు నిలబడేలా జల వనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పాతపాళ్యం గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
మహిళను కొట్టారని ఎమ్మార్‌పల్లి ఎస్సైపై ఆరోపణలు..వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు