ETV Bharat / state

ఓ నాయకా..నిధి నీ విధి! - Legislature meetings

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు కష్టాలు పడుతున్నారు. నిధుల లేమితో పలు ప్రాజెక్టులు ఆగిపోగా..సాగునీటి కాలువల పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. తుపాను చేసిన బీభత్సానికి పలు రకాల పంటలు నీటిలో మునగగా..రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

chittore district budget problems
చిత్తూరు జిల్లాలో బడ్జెట్ సమస్యలు
author img

By

Published : Nov 30, 2020, 2:14 PM IST

చిత్తూరు జిల్లాను సమస్యలు వెంటాడుతున్నాయి. నిధుల లేమితో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. జలాశయ నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. సాగునీటి కాలువ పనులు ముందుకు కదలడం లేదు. జిల్లా ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. ప్రకృతి కన్నెర్ర చేయడంతో సాగులో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. నివర్‌ తుపాను జిల్లాను అతలాకుతలం చేసింది. అతివృష్టితో రైతులకు అపార నష్టం జరిగింది. పశ్చిమ ప్రాంతంలో ఏళ్ల తరువాత రబీలో వరి సాగు చేపట్టిన సమయంలో తుపాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మేటలతో పొలాల స్వరూపమే మారిపోయింది. ఉద్యాన పంటలకు నష్టం కలిగింది. వాతావరణం అనుకూలించని కారణంగా ఈసారి మామిడి పూతపై ప్రభావం కనిపించే అవకాశం ఉందని ఉద్యాన శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. వర్షాలతో టమోట, ఇతరత్రా కూరగాయల సాగుకు అంతరాయం కలుగుతోంది.

రహదారులకు నిధుల లేమి
ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో గుత్తేదారులకు భారీగా బకాయిలున్నాయి. ఇదే తరుణంలో తుపాన్‌తో రహదారులు ధ్వంసమయ్యాయి. బకాయిల కారణంగా గుత్తేదారులు టెండర్లలో పాల్గొనడంలేదు. బకాయిలు తీర్చి కొత్తగా నిధులు ఇస్తే తప్ప రహదారులు బాగుపడే పరిస్థితి లేదు.

వేతన కష్టాలు
జిల్లాలో పొరుగుసేవల కింద పని చేసే సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వడంలేదు. ముఖ్యంగా వైద్య- ఆరోగ్యశాఖలో, రుయా ఆస్పత్రి, గ్రామ పంచాయతీల్లోని సిబ్బందికి కుటుంబ పోషణ భారంగా మారింది. సిబ్బంది జీతాల కోసం ఎదురుచూస్తున్నారు.

చెరకు బకాయిలు
జిల్లాలో ప్రైవేటు చక్కెర పరిశ్రమలు రైతులకు బకాయిలు చెల్లించలేదు. క్రషింగ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్నా... గత బకాయిలు అందలేదు. రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. గాజులమండ్యం సహకార చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామన్న ప్రభుత్వం... ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.

అసంపూర్తిగా ప్రాజెక్టులు
హంద్రీ- నీవా ప్రాజెక్టు అసంపూర్తి పనులు చేపడితే కుప్పం వరకు నీళ్లు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు వాణిని వినిపించి జిల్లాలోని సమస్యలు పరిష్కరిస్తారనే ఆశతో ప్రజలు ఉన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు సమస్యలను ఇలా వివరించారు.

పీలేరు నియోజకవర్గంలో నీట మునిగిన వరి

అన్నదాతలకు చేయూత
తుపాన్‌తో జిల్లాలో ఉద్యానపంటలకు తీవ్ర నష్టం జరిగింది. రైతులను ఉదారంగా ఆదుకోవాలని కోరతా. గ్రామీణ రోడ్లు దెబ్బతిన్నాయి. నష్ట నివారణకు నిధులివ్వాలని కోరుతా. - చింతల రామచంద్రారెడ్డి, పీలేరు

రైతులకు అండగా ఉంటా
తుపాన్‌తో తూర్పు మండలాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి పంటతో పాటు నారుమళ్లు దెబ్బతిన్నాయి. నష్టానికి తగ్గట్టుగా పరిహారం ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తా. -బి.మధుసూదన్‌రెడ్డి, శ్రీకాళహస్తి

పరిహారం కోసం పట్టు
తుపాన్‌తో రైతులు పంటలు కోల్పోయారు. నష్టపోయిన రైతులకు పరిహారం కోసం పట్టుబడతా. పరిహారం పెంచి ఇవ్వాలని కోరతా. రహదారులు వెంటనే పటిష్ఠం చేయడానికి నిధులు అడుగుతా. - వెంకటేగౌడ, పలమనేరు

నిధుల కోసం ఒత్తిడి
అభివృద్ధి పనుల కోసం నిధులు కోరతా. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి ఒత్తిడి తీసుకువస్తా. - నవాజ్‌బాషా, మదనపల్లె

ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి చొరవ
ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోమని కోరతా. చెరువుల అభివృద్ధికి రూ.150 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదముద్ర కోసం పట్టుబడతా. ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి ఒత్తిడి తెస్తా. - ద్వారకనాథరెడ్డి, తంబళ్లపల్లె

వి.కోటలో అసంపూర్తిగా ఉన్న హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం

రైతులకు సాయంపై దృష్టి
తుపాను సమయంలో పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన పిల్లలకు సైతం రూ.500 సాయం అందించాలని కోరతా. మేటలు వేసిన పంట పొలాలను బాగు చేసుకునేందుకు రైతులకు సాయం అందించాలని ప్రస్తావిస్తా. - ఆదిమూలం, సత్యవేడు

రహదారులపై దృష్టి
తుపాను కారణంగా జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని లెక్కించి వెంటనే అన్ని విభాగాల తరఫున పునరుద్ధరణ పనులు చేపట్టాలని కోరతా. రహదారులపై దృష్టి పెట్టాలని విన్నవిస్తా. - కె.నారాయణస్వామి, జీడీనెల్లూరు

రిజర్వాయర్‌ నిర్మాణమే ముఖ్యం
పూతలపట్టు వద్ద నిర్మించే చామంతిపురం రిజర్వాయర్‌ నిర్మాణానికి నిధులు రాబడతా. చిత్తూరులో ఒక్క యూనివర్సిటీ లేదు. దీని కోసం కృషి చేస్తా. మూతబడిన పాలడెయిరీని తెరిపిస్తా. - ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు

అభివృద్ధి కార్యక్రమాలపై ప్రస్తావన
నివర్‌ తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలు దెబ్బతిన్నాయి. అన్నదాతలను ఆదుకోవాలని అసెంబ్లీలో కోరతా. అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ప్రస్తావిస్తా. - చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చంద్రగిరి

ఇదీ చూడండి. 50 ఏళ్ల లీజుకు బస్టాండ్ల స్థలాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.