చాలా కాలంగా వర్షం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతకు ఊరట నిస్తూ కురిసిన వర్షం కొందరికి హర్షం కలిగిస్తే, మరికొందరికి నష్టాన్ని మిగిల్చే విధంగా మారింది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పలు మండలాల్లో వారం రోజులుగా వర్షం కురుస్తోంది.
పల్లెల్లో వీధులు వర్షపు నీటితో పొంగి ప్రవహించాయి. కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఖరీఫ్ సాగు కోసం అన్నదాత ఎదురు చూస్తున్న సమయంలో వర్షం ఉపయోగకారిగా మారిన తరుణంలో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క వేరుశెనగ విత్తిన పొలాలు నీటితో నిండిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి : ముఖ్యమంత్రి కార్యదర్శులకు శాఖల కేటాయింపులో సవరణలు