ముంబయిలో ఉన్న సోనూసూద్ కష్టాల్లో ఉన్న మమ్మల్ని చూసి... ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని రైతు నాగేశ్వరరావు అన్నారు. సినిమాల్లో చూసి ఆయనను విలన్ అనుకున్నామని.. కానీ బయట హీరో అని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తన కుమార్తెలే.. కష్టపడతామని ముందుకొచ్చినట్లు.. రైతు తెలిపారు. వలస కార్మికుల కష్టాలు చూసి.. సోనూసూద్ ముందుకు రావడంపై ఆయనకు పాదాభివందనాలు చేస్తున్నామన్నారు. తమ కుటుంబ కష్టాన్ని సోనూసూద్‌కు తెలిసేలా చేసిన మీడియాకు నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: కష్టమంటే చాలు.. ఇంట్లో మనిషైపోతున్నాడు సోనూసూద్