ETV Bharat / state

పల్లెల్లో ఓటు చైతన్యం... బారులు తీరిన ఓటర్లు - chittoor distirct panchayati elections 2021 news

చెదురు మొదురు ఘటనలు మినహా చిత్తూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ జరిగిన అన్ని మండలాల్లోనూ ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఎన్నికలు జరిగిన పదిమండలాల్లో తొమ్మిదింట 80శాతం పైబడి పోలింగ్ శాతం నమోదు కావటం విశేషంకాగా....కట్టుదిట్టమైన భద్రతతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పల్లెల్లో భారీ ఎత్తున మొహరించారు.

chittoor district third phase panchayati elections
చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలు
author img

By

Published : Feb 18, 2021, 7:14 AM IST

చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాలతోపాటు.. పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలంలో బుధవారం మూడో విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. 10 మండలాల్లోని 173 సర్పంచి, 1,116 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. 84.19 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

9 మండలాల్లో 80 శాతానికిపైగానే పోలింగ్‌ నమోదైంది. తొలి, రెండో విడత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా ఓటింగ్‌ శాతం పెరిగింది. తొలి విడతలో 83.63, మలి దఫాలో 77.20 శాతం పోలింగ్‌ నమోదైంది.

బైరెడ్డిపల్లె మండలంలో అత్యధికంగా 87.93 శాతం, రొంపిచెర్ల మండలంలో అత్యల్పంగా 51.08 శాతం పోలింగ్‌ నమోదైంది. రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు పంచాయతీలో కేవలం ఏడు వార్డులకే ఎన్నికలు జరిగాయి. తెదేపా మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పడం.. పుంగనూరు నియోజకవర్గంలో అన్ని పంచాయతీలు, వార్డులు ఏకగ్రీవం కావడంతో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపినట్టు కనిపించలేదు.

పుంగనూరు నియోజకవర్గ వైకాపా నాయకులు కొందరు కుప్పంలో మకాం వేసినా.. పోలింగ్‌ రోజున వారి జాడ కనిపించలేదు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పెద్దగా శాంతిభద్రతల సమస్య ఏర్పడలేదు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. గుడుపల్లె మండలంలో 87.42 శాతం పోలింగ్‌ నమోదైంది.
అధికారుల పరిశీలన
బుధవారం ఉదయం వి.కోట, బైరెడ్డిపల్లె మండలాల్లోని పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ హరినారాయణన్, జిల్లా ఎన్నికల పరిశీలకులు నవీన్‌కుమార్‌ కుప్పం మండలంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌ గంగవరం మండలంలోని కేంద్రాలను పరిశీలించి.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బందికి సూచించారు. జేసీ(అభివృద్ధి) వీరబ్రహ్మం వి.కోట, పలమనేరు, బైరెడ్డిపల్లె, జేసీ(ఆసరా) రాజశేఖర్‌ రామకుప్పం, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి కుప్పం, గుడుపల్లె మండలాల్లో పోలింగ్‌ సరళిని పరిశీలించారు.
చిన్నచిన్న సంఘటనలు మినహా ...
మూడో విడత సర్పంచి ఎన్నికలు చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో పలు ప్రాంతాల్లో వాలంటీర్ల ద్వారా పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రచారం చేయించారని, దీనిపై అక్కడే ఉన్న అధికారులకు చూపించినా పట్టించుకోలేదని స్థానిక తెదేపా నేతలు ఆరోపించారు.

ఉదయం పోలింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే శాంతిపురం మండలం మఠం పంచాయతీలో ఓటరు చీటీలపై అభ్యర్థి గుర్తులు ముద్రించిన వాటిని పంపిణీ చేస్తున్నట్లు విపక్ష నేతలు తెలిపారు. చీటీలను స్థానికులు కొందరు పట్టుకుని అక్కడే ఉన్న అధికారులకు చూపించినా పట్టించుకోలేదని చెప్పారు. అధికార పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థి గుర్తు కావడంతో అక్కడే ఉన్న పోలీసులు సరిగా స్పందించలేదని విమర్శించారు.

కుప్పం మండలంలోని వెండగంపల్లె, గోగనూరు పంచాయతీల్లో ఎంపీˆ రెడ్డెప్ప పర్యటించడంపైన తెదేపా మద్దతుదారులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఫోన్‌ ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ వి.కోటలోని పోలింగ్‌ కేంద్రం వద్దకు రాగా విపక్ష నేతలు అభ్యంతరం తెలిపారు.

కుప్పం మండలం వెండుగాంపల్లిలో వైకాపా మద్దతు అభ్యర్థికి ఓటు వేయాలంటూ కొందరు అభ్యర్థులు కరపత్రాలు ప్రదర్శిస్తూ కనిపించారు. ప్రభుత్వ పథకాలు అందాలంటే అధికార పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థికి ఓటు వేయాలంటూ ప్రచారం చేశారు.

రామకుప్పం మండలం 89 పెద్దూరు పోలింగ్‌ కేంద్రం వద్ద తోపులాట చోటు చేసుకుంది. కొంతమంది యువకులు పోలింగ్‌ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేశారు.

వి.కోట మండలం చింతమాకులపల్లిలో వాలంటీరు గ్రామం నుంచి ఓటర్లను తీసుకువస్తున్నారని పేర్కొంటూ విపక్షం మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి అతన్ని నిరోధించి చేయిచేసుకున్నారు.
ఎన్నికల సిబ్బందికి మూర్ఛ
ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు సిబ్బందికి మూర్ఛ వచ్చింది. గంగవరం పంచాయతీ రిటర్నింగ్‌ అధికారి జయపాల్‌కు మూర్ఛ రావడంతో ఆయన్ని పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొంతసేపు ఎన్నికల లెక్కింపును తాత్కాలికంగా వాయిదా పడింది. అనంతరం రెండో రిటర్నింగ్‌ అధికారితో లెక్కింపు ప్రారంభించారు. పెద్దపంజాణి మండల కేంద్రంలో పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌ రాజారామ్‌కు కూడా మూర్ఛ రావడంతో చికిత్స నిమిత్తం అధికారులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఓట్ల లెక్కింపు ప్రశాంతం
మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఓటింగ్‌ జరగ్గా.. సాయంత్రం నాలుగు గంటల నుంచి సిబ్బంది లెక్కింపు ప్రారంభించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు భారీగా ఉండటంతో ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాలపై పోలీస్‌ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఆయా కేంద్రాల్లో డీఎస్పీ నేతృత్వంలో పోలీస్‌ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమైన ప్రాంతాల్లో నిఘా పెంచారు. అక్కడ పోలీసులు ఎన్నికల ప్రక్రియను వీడియో తీశారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత కౌంటింగ్‌ సైతం సక్రమంగా సాగేందుకు చర్యలు చేపట్టారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

ఇదీ చదవండి: పంచాయతీ పోరు: ముగిసిన మూడో విడత పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.