చిత్తూరు జిల్లా కలికిరి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్ ) సీఐఎటీ - 3 శిక్షణ కేంద్రంలో రూ.26 కోట్లతో నూతనంగా నిర్మించిన నివాస గృహ సముదాయాలను... సీఆర్పీఎఫ్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ కుల్దీప్ సింగ్ ప్రారంభించారు. దిల్లీ నుంచి విమానం ద్వారా తిరుపతి చేరుకున్న ఆయన.. కలికిరిలోని సీఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రానికి వెళ్లారు.
అద్దె గృహాల్లో ఇబ్బందులు పడుతున్న సీఆర్పీఎఫ్ సిబ్బందికి నూతన గృహలు.. సౌకర్యవంతంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు చతుర్వేది, లక్ష్మి, జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: