చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవాలు ముగిశాయి. ఈ నెల 20 నుంచి 26 వరకు వారం రోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. చివరి రోజైన ఇవాళ వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామి, అమ్మవార్లకు విశేష అలంకరించి అభిషేకాలు చేశారు. మంత్రపుష్పం, హారతులు సమర్పించి ఉత్సవాలకు ముగింపు పలికారు. కొవిడ్ నేపథ్యంలో వేడుకలను ఏకాంతగా నిర్వహించారు.
ఇదీ చదవండి..జూన్ 1 నుంచి.. తిరుమల - అలిపిరి నడక మార్గం మూసివేత!