చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ ఎంపీడోవో కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రక్షణ కవచాలను అందించారు. వైరస్లకు గురికాకుండా ఉండటానికి ఆఫ్రాన్, గ్లౌజ్, హెల్మెట్, సానిటైజర్, అవుట్ గార్డ్ పంపిణీ చేశారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి పారిశుద్ధ్య కార్మికులకు అంబాసిడర్ రక్షణ కిట్లు అందించడం జరుగుతుందన్నారు.
ఇదీ చదవండి: నన్ను తప్పించేందుకు స్కెచ్ వేశారు: ఈటీవీ భారత్తో రఘురామకృష్ణరాజు