చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నేతల వ్యవహారశైలిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డీజీపీ చర్యలు తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. పుంగనూరు తెదేపా నాయకులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్రమాలపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేయాలని నాయకులకు సూచించారు.
నామినేషన్లు వేయకుండా అభ్యర్థులను పోలీసులే బెదిరిస్తున్నారని... 26 మంది తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు మంత్రి పెద్దిరెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. "వైకాపా ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేయాలి" అని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:
పంచాయతీ ఎన్నికల వేళ... మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు