విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ ప్లవ నామ సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని.. శ్రీ గంగా దుర్గ మల్లేశ్వర స్వామివార్లకు మంగళస్నానాలు చేయించి.. వధూవరులుగా అలంకరించారు. సాయంత్రం విఘ్నేశ్వరస్వామి పూజ, పుణ్యాహవచనం, అంకురారోపన, అఖండ దీప స్థాపన, కలశారాధన, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్టాపన బలిహారణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, ఇతర వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు మల్లేశ్వర శాస్త్రి, ఆలయ అర్చక సిబ్బంది శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ పాల్గొని అమ్మవారికి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఇవీ చూడండి.. గుడివాడలో మంత్రి కొడాలి నాని, కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్