కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జల్ శక్తి అభియాన్ బృందం... రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కరకట్ట పంచాయతీలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన జల సంరక్షణ నిర్మాణాలను పరిశీలించింది. చెరువు పూడికతీత, గుంతల నిర్మాణం, చెక్ డ్యాంలు ఏర్పాటు పనులను పరిశీలించి రైతుల అభిప్రాయాలను తెలుసుకుంది. ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఆరా తీసింది. అనంతరం కంగానపల్లి పంచాయతీ కేంద్రంలో గ్రామ సభకు బృంద సభ్యులు హాజరయ్యారు. జలసంరక్షణ ఆవశ్యకతను కేంద్ర బృందం సభ్యులు గిరిధర గోపాల కృష్ణ, సుదర్శన్ కుమార్ గ్రామస్థులకు వివరించారు. వర్షపు నీటిని సంరక్షించి భావితరాలకు నీటి సమస్య లేకుండా చూడాలని కోరారు. ఇది అందరి బాధ్యతగా చెప్పారు.
ఇదీ చదవండి : "నీటి ఒప్పందంతో ఆంధ్రాకు అన్యాయం"