ETV Bharat / state

వాగులో కొట్టుకుపోయిన కారు.. తండ్రీకుమార్తె మృతి - కొండయ్యగారి పల్లె వాగులో తండ్రీ కుమార్తె మృతి

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కొండయ్యగారి పల్లె వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో తండ్రీకుమార్తె గల్లంతయ్యారు. శుక్రవారం కుమార్తె మృతదేహాన్ని గుర్తించగా.. నేడు తండ్రి భౌతికకాయాన్ని కనుగొన్నారు.

car washed away in the stream father and daughter died in penumuru chittore district
వాగులో కొట్టుకుపోయిన కారు.. తండ్రి మృతదేహం వెలికితీత
author img

By

Published : Oct 24, 2020, 12:14 PM IST

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కొండయ్యగారి పల్లె వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో.. ప్రతాప్ మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెలికితీశారు. గురువారం అర్ధరాత్రి కనిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వివాహానికి హాజరై తిరిగివస్తుండగా.. కొండయ్యగారి పల్లె వాగు ఉద్ధృతంగా ప్రవహించటంతో వారు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది.

ఈ ఘటనలో ప్రతాప్, అతని కుమార్తె సాయివినీతలు గల్లంతయ్యారు. వినీత మృతదేహాన్ని శుక్రవారం సాయంత్రం గుర్తించారు. నేడు ప్రతాప్ మృతదేహాన్ని వెలికితీశారు. తండ్రీకుమార్తె మరణంతో వారి స్వగ్రామమైన వడ్డారపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి..

వాగులో కొట్టుకుపోయిన కారు...తండ్రీ కుమార్తె గల్లంతు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.