అనంతపురంలో స్నేహలత అనే యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నగరి ప్రజా సంఘం ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. దేశంలో రోజు రోజుకు ఎస్సీ,ఎస్టీ బడుగు బలహీన వర్గాలపైన దాడులు పెరిగిపోతున్నాయని నాయకులు ఆరోపించారు. మహిళల రక్షణకోసం ప్రభుత్వం తీసుకువచ్చిన దిశా చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి నేరస్థులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. స్నేహలత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో కల్పించడంతో పాటు.. వారి కుటుంబానికి రూ.10 లక్షల ఇవ్వాలని అన్నారు. మతాలకు కులాలకు అతీతంగా ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు, పలు సంఘాలు పాల్గొన్నాయి.
ఇదీ చదవండి: 14రోజుల రిమాండ్కు స్నేహలత హత్య కేసు నిందితులు