తిరుమల రెండో ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా మదనపల్లెకి చెందిన పవన్ అనే యువకుడు కొండ పైనుంచి ద్విచక్రవాహనంపై కిందకు దిగుతుండగా అదుపుతప్పి బస్సుకింద పడి మృతి చెందాడు. వినాయకస్వామి ఆలయ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న తితిదే భద్రత సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహన్ని శవపరీక్షల నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. యువకుడితో పాటు ఉన్న యువతి స్పల్పగాయాలతో బయటపడింది.
ఇదీచదవండి