ETV Bharat / state

స్కూటర్​ దగ్ధం... ఆ పక్కనే రక్తపు మరకలున్న గోనె సంచులు..! - చంద్రగిరి లేటెస్ట్​ అప్​డేట్స్​

Mystery: చిత్తూరులో ద్విచక్ర వాహనం దగ్ధమైన ఘటన కలకలం రేపింది. కాలిపోయిన బైకు పక్కన రక్తపు మరకలున్న గోనె సంచులు కనిపించడంతో.. పోలీసులు క్లూస్​ టీమ్​ను రప్పించి అన్వేషణ ప్రారంభించారు.

Mystery
స్కూటర్​ దగ్ధం
author img

By

Published : Mar 18, 2022, 7:12 AM IST

Mystery: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తొండవాడ గ్రామపంచాయతీ పరిధిలో బైకు దగ్ధమైన ఘటన స్థానికులను కలవరపాటుకు గురిచేసింది.కాలిపోయిన బైక్ సమీపంలోనే రక్తపు మరకలు ఉన్న గోనె సంచులు గుర్తించిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందిచారు. రంగంలోకి దిగిన పోలీసులు... ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ సంఘటన సుమారు 15 రోజుల క్రితం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.

Mystery: స్కూటర్​కు ఉన్న నెంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. సదరు బైక్ 20 రోజుల క్రితం అపహరణకు గురైనట్లుగా తెలిసింది. ఆ ద్విచక్రవాహనాన్ని ఎందుకు కాల్చారు..? రక్తపు మరకలున్న గోనె సంచులు అక్కడికి ఎందుకు వచ్చాయి..? అన్న అనుమానంతో క్లూస్​టీంను రప్పించి.. గోని సంచులు, వస్త్రాలతోపాటు స్కూటర్ దగ్ధమైన ప్రదేశంలో మరికొన్ని ఆనవాళ్లను సేకరించారు. దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు చంద్రగిరి పోలీసులు వివరాలు వెల్లడించారు.

ఇదీ చదవండి: కృష్ణాజిల్లా సీఐటీయూ నాయకురాలు ఆత్మహత్య... అధికార పార్టీ నేత వేధింపులే కారణం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.