తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం శిల్పకళా, మ్యూజియం, అటవీ విభాగం అధికారులు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి కలసి ప్రారంభించారు. కల్యాణవేదిక వద్ద ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన శాలను ఆకర్షణీయంగా రూపొందించారన్నారు. ఈ ఏడాది తమిళనాడులోని కాంచీపురం అత్తివరదరాజస్వామివారి ఆలయం నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని తితిదే ఛైర్మన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: తిరుమల నిత్య కల్యాణోత్సవం ప్రత్యేకత ఏంటి...?