చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నియోజకవర్గంలో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనలో అధికారులు భారీగా అవకతవకలకు పాల్పడ్డారని తేదేపా, భాజపా, జనసేన నేతలు ఆందోళనకు దిగారు. శ్రీకాళహస్తి ఎంపీడీవో కార్యాలయం ఎదుట రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. నామినేషన్ల పరిశీలనలో తిరస్కరణకు గురయ్యే వారికి ఫారం -7ను అందజేయాల్సి ఉండగా.. శ్రీకాళహస్తి, ఏర్పేడు తొట్టంబేడు, రేణిగుంట మండలాల్లో ఎలాంటి ఫారాలను అందజేయకుండా అధికారులు వెళ్లిపోయారని వాపోయారు. ఉన్నతాధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు కూడా అందుబాటులోకి రాకపోవటం దారుణంని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళనకారులు తేల్చి చెప్పటంతో.. డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని చర్చలు నిర్వహించారు.
ఇవీ చూడండి... :కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్తత.. రీకౌంటింగ్ చేయాలంటూ ఆందోళన