చిత్తూరు జిల్లా సదుం మండల ఎంపీడీవో కార్యాలయంలో భాజపా నాయకుడు కలికిరిహరిపై దౌర్జన్యం చేసిన వైకాపా నాయకులను అరెస్టు చేయాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్, కలెక్టర్ భరత్ గుప్తాకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైన తమ పార్టీ నాయకుడిపై వైకాపా నాయకులు దౌర్జన్యానికి పాల్పడటం అప్రజా స్వామికమని భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి:
ఎంపీటీసీ నామినేషన్లలో వాగ్వాదం.. భాజపా నేతలను అడ్డుకున్న వైకాపా నేతలు