ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ గుర్తుకువచ్చేదని.. ఇప్పుడు ఆటవికరాజ్యంగా మారిందని భాజాపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లాలో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైకాపా నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ.. భాజాపా నాయకులు తిరుపతిలో ఆందోళన నిర్వహించారు. నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. స్ధానిక సంస్ధల ఎన్నికలు జరుగుతున్న తీరును తప్పుపట్టారు. అధికార వైకాపా తప్ప మరే పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదన్నట్లు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారని నినాదాలు చేశారు. వైకాపా ఎన్నికలను ఏకగ్రీవం చేసుకున్న చోట రీషెడ్యూల్ చేయాలని.. భాజపా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: