చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రాజాఇండ్లు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తండ్రి శ్రీనివాస్, కుమారుడు మనోజ్, కుమార్తె నిహారికగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: