చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరులో దారుణం జరిగింది. ఘంటసాల సర్కిల్ సమీపంలోని కోనేటి వద్ద.. ఓ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. కళ్లు కూడా తెరవని ఆడబిడ్డను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిన్నారి ఏడుపు విని.. చలించిన ఓ మహిళ పాపను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చిన్నారిని పిల్లల సంరక్షణ అధికారులకు అప్పగించారు.
ఇదీ చదవండి: