చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం దేసూరి కండ్రిగకు చెందిన రేఖ అనే మహిళ తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆడ శిశువు జన్మించగా.. పుట్టిన కాసేపటికే చిన్నారి కన్ను మూసింది. అయితే ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్యులు శిశువు తల్లిదండ్రులు, బంధువులకు చెప్పకుండా మధ్యాహ్నం వరకు ఐసీయూలో ఉంచటంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి బయట బైఠాయించి శిశువు మృతదేహంతో ధర్నాకు దిగారు. చిన్నారి శరీరంపై గాయాలను పోలిన మచ్చలు ఉండటంతో... వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి ప్రాణాలను కోల్పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆసుపత్రి వైద్యులు మాత్రం మేనరికం సంబంధిత జన్యుపరమైన లోపాలతో శిశువు కన్నుమూసిందని తెలిపారు. ఈ విషయాన్ని ఎందుకు వెంటనే చెప్పలేందంటూ చిన్నారి బంధువులు ఆందోళన చేపట్టారు.
ఇవీ చదవండి