చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, స్వీకార్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అసంక్రమిత రోగాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్యోద్దేశమని నిర్వహకులు తెలిపారు. క్యాన్సర్ వ్యాధి లక్షణాలు... వాటి బారిన పడితే జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
జీవనశైలిలో వచ్చిన మార్పు కారణంగా కొత్త ఆరోగ్య సమస్యలు వస్తాయని వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తొండవాడ వాసులకు వైద్యులు వివరించారు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే నోరు, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లపై ఉచిత స్క్రీనింగ్ కార్యక్రమం చేపట్టారు. గ్రామీణ మహిళలకు వ్యక్తిగత ఆరోగ్యంతోపాటు క్యాన్సర్ వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు.
ఇవీ చదవండి: జీవితంపై విరక్తితో బావిలో దూకి వృద్ధురాలు ఆత్మహత్య