కరోనా మృతదేహాల అంత్యక్రియల్ని అడ్డుకోవద్దని వేడుకుంటూ.. అపోహలను తొలగించేలా అవగాహన కార్యక్రమానికి చిత్తూరు జిల్లా యంత్రాంగం సోమవారం శ్రీకారం చుట్టింది. కొవిడ్‌తో మరణించిన ఇద్దరి మృతదేహాలకు జిల్లా కలెక్టరు ఎన్.భరత్‌గుప్తా, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనరు గిరీష, ఎస్పీ రమేష్‌రెడ్డి, ఆర్డీవో కనక నరసారెడ్డి దగ్గరుండి రేణిగుంట మండలం తూకివాకం వద్ద ప్రభుత్వ స్థలంలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఉన్నతాధికారులు కేవలం మాస్కులు ధరించి పాల్గొన్నారు. మృతదేహంలో వైరస్ 6 గంటలకు మించి ఉండదని, ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధ్రువీకరించిందని కలెక్టర్ గుర్తుచేశారు. మరణించిన 6 గంటల తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: అప్పు తీర్చలేదని మహిళను ట్రాక్టర్‌తో తొక్కించిన వైకాపా నాయకుడు