చిత్తూరు జిల్లా వి.కోట మండలం పెద్దబరినేపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన 12ఏళ్ల బాలికపై నక్కనపల్లెకు చెందిన ఓ ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. గ్రామానికి సమీపంలోని ఓ ప్రైవేట్ పాల డెయిరీలో పనిచేస్తున్న బాధితురాలిపై నిఘా పెట్టిన ఆటో డ్రైవర్ ఆదివారం రాత్రి సమయంలో అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గత రాత్రి బాలిక ఆలస్యంగా ఇంటికి రావటాన్ని తల్లితండ్రులు గమనించారు. అనుమానంతో ఉదయం డెయిరీకి వచ్చిన ఆటో డ్రైవర్ను ప్రశ్నించగా దారుణం వెలుగు చూసింది. నిందితుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు... వి. కోట పోలీసులకు అప్పగించారు. బాధితురాలి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి