ETV Bharat / state

పదునైన ఆలోచన.. అద్భుత ఆవిష్కరణకు నమూనా - తంబళ్లపల్లి విద్యార్థి నూతన ఆవిష్కరణ వార్తలు

రెక్కాడితే కాని డొక్కాడని వ్యవసాయ కూలీల పిల్లలు వారు. డబ్బుకి కొరతే కానీ మేదస్సుకి కాదు. ఉపాధ్యాయుల చొరవతో చదువుకున్న పాఠాలను నిత్యజీవితంలోకి ఆపాదించుకొని కొత్త ఆవిష్కరణకు నమూనాలు తయారు చేస్తున్నారు. అందరీ ప్రశంసలు పొందుతున్నారు.

పదునైన ఆలోచన.. అద్భుత ఆవిష్కరణకు నమూనా
పదునైన ఆలోచన.. అద్భుత ఆవిష్కరణకు నమూనా
author img

By

Published : Mar 13, 2020, 1:30 PM IST

పదునైన ఆలోచన.. అద్భత ఆవిష్కరణకు నమూనా

చిత్తూరు జిల్లాలో అత్యంత మారుమూల నియోజకవర్గం తంబళ్లపల్లి ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మేదస్సుకు పదును పెడుతున్నారు. నిత్యం కరవుతో నలిగిపోతున్న ఈ ప్రాంత రైతులు, కూలీల పిల్లలు.. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి చదువులో రాణించడంతో పాటు నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.

తమ చుట్టూ జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలు, పనులు, యంత్రాల నిర్వహణ, వినియోగం తదితర అంశాలను పరిశీలిస్తూ.. భవిష్యత్తులో ప్రజలు ఎదుర్కోబోతున్న నిత్యావసరాల కొరతను దృష్టిలో పెట్టుకొని కొత్తదనాన్ని సృష్టిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులను తట్టుకోవడానికి ఉపయోగపడే వస్తువులు, యంత్రాలను తయారు చేయడానికి కొత్త నమూనాలు కనిపెడుతున్నారు. భవిష్యత్తులో తలెత్తబోయే డీజిల్, పెట్రోల్ కొరతను తట్టుకోవడానికి నీటి ఒత్తిడితో నడిచే యంత్రాల తయారీకి నమూనాలు తయారు చేశారు.

తంబళ్లపల్లి మండలం గోవిందా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గిరిధర్​ రెడ్డి నీటి ఒత్తిడితో జేసీబీని నడిపించే నమూనాను తయారు చేశారు. ఈ నమూనా విజయవంతమైతే మనం ఎదుర్కొంటున్న డీజిల్, పెట్రోల్ కొరతను అధిగమించవచ్చు. గిరిధర్​ రెడ్డితో పాటు పాఠశాలలో చదువుతున్న మిగిలిన విద్యార్థులు పలు రకాల విజ్ఞాన ప్రదర్శన నమూనాలను ఉపాధ్యాయుల సహకారంతో విజయవంతంగా తయారు చేస్తున్నారు. అందరి మన్ననలూ పొందుతున్నారు.

ఇదీ చదవండి: మహిళల సంక్షేమానికి కర్నూలుకు చెందిన నఫీజ్ ఫిజర్: పెద్దపీట

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.