చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఓ ప్రైవేటు వెంచర్‌లోని పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు యత్నించగా..స్థానికులు వారిని అడ్డుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..చంద్రగిరి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 576,577లోని 11 ఎకరాల స్థలాన్ని నవరత్నమ్మ అనే మహిళ వెంచర్ చేసింది. అందులో ఎకరా స్థలాన్ని పార్కు కోసం కేటాయిస్తున్నట్లు ప్రత్రాల్లో చూపించి తుడా నుంచి అనుమతి పొందారు. అనంతరం పాట్లను విక్రయించారు.
ప్రస్తుతం భూముల ధరలు భారీగా పెరగటంతో అక్రమార్కుల కన్న పార్కు స్థలంపై పడింది. గత కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న పార్కు స్థలాన్ని కబ్జా చేసేందుకు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్లాట్ల కొనుగోలు దారులు వారిని అడ్డుకున్నారు. పార్కు స్థలం తమ కాలనీకి కేటాయించారని..,మీరెలా అక్కడ నిర్మాణాలు చేపడతారని అడ్డుకున్నారు. అనంతరం పార్కు స్థలం కబ్జా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి
పవన్ చెప్పినట్లు అన్ని పార్టీలు ప్రభుత్వంపై పోరాడాలి: విష్ణుకుమార్ రాజు