ETV Bharat / state

నకిలీ నగలు తనఖా పెట్టిన వ్యక్తి అరెస్ట్

చిత్తూరు సహకార టౌన్ బ్యాంకులో నకిలీ నగలను తనఖా పెట్టి రూ.80 లక్షలు రుణం తీసుకున్న కేసులో ఆ బ్యాంకు మాజీ చైర్మన్ షణ్ముగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి చెందిన స్థిర, చర ఆస్తుల్ని సీజ్ చేసి రిమాండ్​కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

author img

By

Published : Feb 19, 2020, 7:30 PM IST

Arrested for mortgage of counterfeit jewelery
నకిలీ నగలు తనఖా పెట్టిన వ్యక్తి అరెస్ట్
నకిలీ నగలు తనఖా పెట్టిన వ్యక్తి అరెస్ట్

చిత్తూరు సహకార టౌన్ బ్యాంకులో నకిలీ నగలను తనఖా పెట్టి రూ.80 లక్షలు రుణం తీసుకున్న కేసులో ఆ బ్యాంకు మాజీ చైర్మన్ షణ్ముగాన్ని పోలీసులు అరెస్టు చేశారు. టౌన్ బ్యాంకు తాజా మాజీ ఛైర్మన్ షణ్ముగం 2016లో 5 కిలోల నకిలీ బంగారు ఆభరణాలు టౌన్​లోని దర్గా శాఖలో తనఖా పెట్టి రూ.80 లక్షల రుణం పొందినట్లు ఆ శాఖ మేనేజర్ పీఆర్ సుబ్రమణ్యం ఈ నెల 13 వ తేదీన చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన బంధువులు, అనుచరులు 14 మందితో టౌన్ బ్యాంకులో ఖాతాలు తెరిపించి 5 కిలోల నకిలీ బంగారు ఆభరణాలను 43 దఫాలుగా కుదవ పెట్టి షణ్ముగం రుణాలు పొందినట్లు చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్​రెడ్డి వెల్లడించారు. ఇందులో బ్యాంకు అప్రయిజర్ ధరణీ సాగర్​కు కొంత నగదు ఇచ్చినట్లు వివరించారు.

ఇదీ చూడండి:ఇంటర్ ప్రాక్టికల్స్​లో కాపీయింగ్

For All Latest Updates

TAGGED:

bank
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.