ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో వాచ్మెన్లుగా పనిచేస్తున్న వారికి ఆపరేటర్లుగా పదోన్నతి కల్పించాలని యునైటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయమణి డిమాండ్ చేశారు. సీఎండీ ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రజాప్రతినిధుల జోక్యం సరికాదంటూ.. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న వాచ్మెన్లకు న్యాయంగా రావాల్సిన ఆపరేటర్ ఉద్యోగాలలో.. ప్రజాప్రతినిధుల జోక్యం చేసుకోవడం సమంజసమని కాదని ఆమె ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధం..