- ఘనంగా ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి వేడుకలు
Vaikuntha Ekadashi Celebrations: వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక తిరుమల శ్రీవారి దర్శనం కోసం అర్ధరాత్రి దర్శనాలను ప్రారంభించారు. పలువురు ప్రముఖులను శ్రీవారిని దర్శించుకున్నారు.
- చంద్రన్న కానుక పంపిణీలో తొక్కిసలాట, ముగ్గురు మహిళలు మృతి
గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన జనతావస్త్రాలు, సంక్రాంతి కానుక పంపిణీలో విషాదం చోటు చేసుకుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అతిథిగా హాజరై...కొంతమందికి వేదికపై కానుకలు అందించి వెళ్లిపోయారు. ఆ తరువాత జరిగిన పంపిణీలో తొక్కిసలాట సంభవించి ముగ్గురు మహిళలు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
- గుంటూరు ఘటనలో మృతుల కుటుంబాలకు భారీగా అర్థిక సాయం..
చంద్రన్న కానుకల పంపిణీ ఘటనలో మృతులకు.. నష్టపరిహారం చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించారు. మృతల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. అటు ఘటనకు బాధ్యత వహిస్తూ.. ఉయ్యూరు ఫౌండేషన్ మృతుల కుటుంబాలకు భారీ సాయం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.20 లక్షల సాయం అందించనున్నట్లు ఉయ్యూరు శ్రీనివాస్ వెల్లడించారు. అటు చంద్రబాబు కూడా పార్టీ తరుపున మృతుల కుటుంబసభ్యులకు రూ. 5లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
- పోలీసుల అదుపులో మాజీ ఎంపీ హరిరామజోగయ్య.. ఇంటి వద్ద ఉద్రిక్తత
కాపు రిజర్వేషన్ల సాధన కోసం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో నిరవధిక నిరాహార దీక్ష చేసేందుకు పూనుకున్న మాజీ మంత్రి హరిరామజోగయ్యను పోలీసులు బలవంతంగా అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. దీక్ష చేసేందుకు ఆయన నివాసం వద్దే ఆదివారం ఉదయం నుంచి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నానికి పోలీసులు ఆయన నివాసానికి వెళ్లే రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు.
- 'ఓబీసీ జడ్జిల సంఖ్య 15శాతమే.. కొలీజియంతో సామాజిక న్యాయం జరగట్లేదు'
కొలీజియం నియామకాల్లో సామాజిక న్యాయం లోపించిందని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది. గత ఐదేళ్లలో హైకోర్టుల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో ఓబీసీలు కేవలం 15 శాతం మాత్రమే ఉన్నారని తెలిపింది.
- చైనా ప్రయత్నాలు ఫలించవు: దలైలామా
చైనాపై బౌద్ధమత గురువు దలైలామా కీలక వాఖ్యలు చేశారు. చైనా.. బౌద్ధమతాన్ని ధ్వంసం చేయాలని చూస్తుందన్నారు. అందుకు చైనా చేసే యత్నాలు ఫలించవని ఆయన పేర్కొన్నారు.
- అద్దె చెల్లించని ఎలాన్ మస్క్.. ట్విట్టర్‌పై దావా.. భవనం ఖాళీ చేయాలని నోటీసులు
ఇటీవలే ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయన.. ట్విటర్ ప్రధాన కార్యాలయం అద్దెను కొంతకాలంగా చెల్లించడం లేదట. దీంతో భవన యాజమాన్య సంస్థ కోర్టులో దావా వేసింది.
- రైలు ప్రయాణం.. రూ.10 లక్షల బీమా.. ఈ విషయాలు తెలుసుకోండి మరి!
రైలు ప్రయాణం చేసేవారికి రూ.10 లక్షల బీమా సౌకర్యం ఉంటుంది. అయితే, టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. అదెలా అంటే?
- 'ఓపెనర్‌గా రాహుల్ వద్దు.. ఇషాన్ కిషన్‌కు అవకాశమివ్వండి'.. గంభీర్ సలహా
టీమ్ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ గౌతమ్ గంబీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడిని ఓపెనర్‌గా ఆడించడాన్ని తప్పుబట్టాడు. అతడి ప్లేస్‌లో మరో యువ క్రికెటర్‌ను ఆడించాలని సూచించాడు. ఇంకా ఏమన్నాడంటే..
- 'అన్నా ఎందుకిలా చేశావు?'.. విజయ్ దేవరకొండ పోస్ట్‌పై నెటిజన్ల రిప్లై!
నూతన సంవత్సరం సందర్భంగా సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే?