స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి.. ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన త్యాగధనులను స్మరించుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి అన్నారు. చిత్తూరులోని పోలీసు గ్రౌండ్లో నిర్వహించిన 74వ స్వాంతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొన్న ఆయన... మహిళలు, రైతులు, యువతను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యులను చేస్తున్నామని చెప్పారు.
పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి.. సమగ్రాభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. సీఎం జగన్ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారాన్ని అందించాలని.. ఆయనకు అండగా నిలవాలని కోరారు.