తమిళనాడు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన అంతర్రాష్ట్ర దొంగ ఆంధ్రా పోలీసులకు చిక్కాడు. తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లాలోని పలు ఠాణాల్లో ఇతనిపై 60 కేసులు ఉన్నాయి. దొంగతనాలు, దోపిడీలు, గ్యాంగ్‌రేప్ కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. బంగారుపాళ్యం పోలీసులు తమిళనాడు-బెంగళూరు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా ఉన్న ఎస్.వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా... అసలు విషయం బయటపడింది. తమిళనాట మోస్ట్ వాంటెడ్ దొంగ అని తెలిసింది. అతని నుంచి ఓ స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండీ... 1,184 వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్