ETV Bharat / state

వకుళమాత ఆలయం వద్ద బయటపడ్డ పురాతన శాసనం - news on vakulamatha temple

తిరుపతి సమీపంలోని పేరూరులో ఉన్న వకుళమాత ఆలయంలో చారిత్రక శాసనం బయట పడింది. పేరూరు గ్రామంలో వకుళ మాత ఆలయ అభివృద్ధి పనులు చేస్తుండగా శాసనం కనిపించింది. అది 11వ శతాబ్దంలో నాటి చోళ రాజు మొదటి కులోత్తంగ చోళుడు తమిళంలో జారీ చేసిన శాసనంగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు.

An ancient inscription found at the Vakulamata temple
వకుళమాత ఆలయం వద్ద బయటపడ్డ పురాతన శాసనం
author img

By

Published : Aug 5, 2020, 12:06 PM IST

తిరుమల శ్రీవారి తల్లిగా పూజలు అందుకునే వకుళమాత ఆలయంలో చారిత్రక శాసనం ఒకటి బయట పడింది. తిరుపతి సమీపంలోని పేరూరు గ్రామంలో వకుళ మాత ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో ఈ పురాతన శాసనం వెలుగు చూసింది.

ఈ శాసనాన్ని పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు 11వ శతాబ్దంలో తమిళంలో నాటి చోళ రోజు మొదటి కులోత్తంగ చోళుడు జారీ చేసిన శాసనంగా గుర్తించారు. ఈ శాసనం ఆధారంగా ఇక్కడే విష్ణు మూర్తి అలయంతో పాటు, అమ్మవారి ఆలయం ఉన్నట్లు చెబుతున్నారు. తితిదేలో వకుళామాత ఆలయానికి సంబంధించి..గతంలో శాసన ఆధారాలు దొరకని పక్షంలో... ఈ శాసనంపై పురావస్తు శాఖ అధికారులు మరింత లోతుగా పరిశోధనలు జరుపుతున్నారు.

ఇదీ చదవండి: రామాలయం భూమిపూజ- 10 కీలకాంశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.