చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో చేపల చెరువులపై... రాజకీయ నాయకుల జోక్యం చేసుకోవటం తగదని.. అఖిల భారత గంగపుత్ర మహాసభ జాతీయ సహాయ కార్యదర్శి మడితం వెంకటరమణ బెస్త అభిప్రాయపడ్డారు. ఫిషర్‌మెన్ కో ఆపరేటివ్ సొసైటీ పీలేరులో గత 30 ఏళ్లుగా 6 చెరువుల్లో చేపల పెంపకానికి ఇరిగేషన్ శాఖ వారు బెస్త సంక్షేమ సంఘం సొసైటీకి అనుమతినిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ పలుకుబడితో..
కొందరు రాజకీయ పలుకుబడితో రెండింటికి మాత్రమే బెస్త కులస్తులతో ఫీడ్ వదలనిచ్చి మిగిలిన నాలుగు చెరువుల్లో అడ్డుకుంటున్నట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన 6 చెరువులను బెస్త సంక్షేమ సంఘం సొసైటీకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఎంతవరకైనా పోరాడతాం..
లేని పక్షంలో బెస్త జాతి సంక్షేమం కోసం ఎంత వరకైనా పోరాడుతామని హెచ్చరించారు. బెస్త సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రమణ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండీ...'చెరువుకు తూములు ఏర్పాటు చేయండి'