శ్రీవారి సేవలో 'అల వైకుంఠపురములో' చిత్ర బృందం - తిరుమల శ్రీవారి సన్నిధిలో అల వైకుంఠపురంలో చిత్ర బృందం
తిరుమల శ్రీవారిని 'అల వైకుంఠపురములో' చిత్రం బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హీరో అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. చిత్ర నిర్మాత చినబాబు, దర్శకులు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు తమన్ కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి వారిని శేషవస్త్రాలతో సత్కరించి...తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో 'అల వైకుంఠపురంలో' చిత్ర బృందం