వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాతగుంటలో జరిగింది. ప్రేమలత అనే యువతి పొలం పని ముగించుకుని చేతులు శుభ్రం చేసుకునేందుకు సమీపంలోని వ్యవసాయ బావిలోకి దిగింది. నీళ్లు ఎక్కువగా ఉండటంతో మెట్లన్నీ పాకురు పట్టాయి. ఇది గమనించకపోవటంతో ఆమె కాలుజారి బావిలో పడిపోయింది. పొలం వద్దకు వెళ్లిన ప్రేమలత ఎంతసేపటికీ తిరిగి రాకపోవటంతో తల్లీదండ్రులు పొలం వద్దకు వెళ్లారు. తమ కుమార్తె పాదరక్షలను చూసి ఆమె బావిలో పడినట్లు అనుమానించి కేకలు వేశారు. వారి అరుపులతో పొలం వద్దకు చేరుకున్న గ్రామస్థులు యువతి బావిలో పడినట్లు నిర్ధరించుకుని వెలికితీశారు. ఆమెను పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చూడండి: బావిలో శవాలుగా తేలిన తల్లి, నలుగురు కుమార్తెలు