చిత్తూరు జిల్లా పీలేరు పట్టణంలో కె.వి.పల్లి బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ బాలాజీ... తిరుపతి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. పాఠశాలకు నిత్యావసర సరకులు సరఫరా చేస్తోన్న గుత్తేదారు ఖాదరవల్లికి... ఐదు నెలల బిల్లులు రూ.6 లక్షల వరకు రావాల్సి ఉంది. ఈ బిల్లులు చెల్లించాలంటే రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని బాలాజీ డిమాండ్ చేశాడు. చేసేదేమి లేక... తిరుపతి అవినీతి నిరోధక శాఖ అధికారులను గుత్తేదారు సంప్రదించారు. స్పందించిన అధికారులు... రంగు అద్ధిన నోట్లను గుత్తేదారుడికి ఇచ్చారు. వాటిని అతని వద్ద నుంచి ప్రిన్సిపాల్ తీసుకుంటుండగా... అనిశా అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:విశాఖలో ముగిసిన 21వ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం