కరోనా నిర్ధారణ పరీక్షకు వచ్చి ఆస్పత్రి ఎదుట ఓ వృద్ధుడు మృతి చెందాడు. కొవిడ్ టెస్ట్ కోసం ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా ఎంపెడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద చోటు చేసుకుంది.
ఎంపెడు పీహెచ్సీలోనే..
శ్రీకాళహస్తి మండలం ఎర్రమ్మరెడ్డి పల్లికి చెందిన శంకరయ్యకు కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కరోనా పరీక్షల నిమిత్తం ఎంపెడు పీహెచ్సీ కేంద్రానికి వచ్చాడు. అనంతరం పరీక్షల నిమిత్తం వైద్య సిబ్బంది శాంపిల్స్ తీసుకున్న కొద్ది సేపట్లోనే ఆస్పత్రిలో కుప్పకూలిపోయాడు. స్పందించిన వైద్యులు బాధితుడ్ని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఇవీ చూడండి : కరోనా సోకిందా.. కంగారుపడొద్దు..!