చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎగువ రెడ్డివారి పల్లె గ్రామం నందు రైతు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. రెడ్డివారిపల్లెకు చెందిన త్యాగయ్య అదే గ్రామంలో కౌలు భూములను తీసుకొని సాగు చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం పొలానికి నీరు కట్టడానికి బోర్ మోటర్ దగ్గరకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఎంతకీ రైతు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం దగ్గరకు వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉండడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుయ్యారు.
ఇవీ చదవండి