చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లి మండలంలోని గౌడసానివారిపల్లెలో నాటు బాంబు పేలి గౌడసాని రమణా రెడ్డి గాయపడ్డాడు. తక్షణమే కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వేరొక ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఉదయం పశువుల కొట్టంలో పాలు పితకడానికి వెళ్లగా.. నిమ్మకాయ సైజులో ఉండ కనిపించినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. దాన్ని చేత్తో పట్టుకొని విసిరేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా పేలిందని పేర్కొన్నాడు. ఈ ప్రమాదంలో అతని చేతి వేళ్ళు ఊడిపోగా.. కుడికాలు తీవ్రంగా దెబ్బతింది.
మాయమాటలు చెప్పి సెల్ఫీ అంటాడు.. మార్ఫింగ్ చేసి డబ్బులు గుంజుతాడు