కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా హాస్పిటల్స్, క్వారంటైన్ సెంటర్ లలో బెడ్లు దొరక్క కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత నిధులతో చంద్రగిరి మండలం, తొండవాడ ఉన్న హీరా కాలేజ్ లో కొవిడ్ కేర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం జిల్లా కలెక్టర్ హరినారాయణ,ఆర్డీఓ కనక నరసారెడ్డిలతో కలసి ఏర్పాట్లును పరిశీలించారు.
పద్మావతి కొవిడ్ కేర్ సెంటర్ ద్వారా ఇప్పటికే కరోనా బాధితులకు సేవలందిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే పెరుగుతున్న రోగుల దృష్ట్యా హీరా కాలేజ్ లో 250 పడకలను సిద్ధం చేశామన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రేపు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. 40 టీములు నిత్యం శ్రమిస్తూ కరోనా బాధితులకు అండగా ఉంటారన్నారు. కొవిడ్ కిట్లు, పౌష్టికాహారం, నిత్యవసర వస్తువులను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
శభాష్ నాగలక్ష్మీ.. సోనూసూద్ ఫౌండేషన్‌కు నీ సాయం గొప్పది తల్లీ!