తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) ఛైర్మన్ పదవికి ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. వైకాపాలో అంతర్గతంగా జరిగిన చర్చల అనంతరం సుబ్బారెడ్డికి ఈ పదవి కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుత పాలకమండలి రద్దు చేసిన తర్వాతే ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తర్వాత అత్యవసర ఆర్డినెన్స్ ద్వారా తితిదే పాలకమండలిని రద్దు చేసి, నూతన మండలిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే... తితిదే ఛైర్మన్ పదవికి మొదటి నుంచీ సుబ్బారెడ్డి ఆసక్తి చూపటం లేదు. రాజ్యసభ సీటు ఆయన ఆశిస్తున్నారు. పార్టీ పరంగా ఇతరులకు ఇచ్చిన హామీలుండటంతో రెండేళ్ల వరకూ ఆ సీటు సుబ్బారెడ్డికి ఇచ్చేందుకు అవకాశం లేదని వైకాపా అధిష్ఠానం భావిస్తోంది. అందువల్లే ప్రస్తుతం తితిదే ఛైర్మన్గా వెళితే... రెండేళ్ల తర్వాత రాజ్యసభ ఇస్తామని చెప్పటంతో వైవీ అంగీకరించినట్టు సమాచారం.
ఇదీ చదవండీ: యాప్లో ఆర్డరివ్వండి.. తాజా 'కొబ్బరి నీళ్లు' తాగండి