అవగాహనలేమితో...
పిట్టల లంక శివారు నారేపాలెం వాసి రాజారావు జీవితాన్ని నాటువైద్యం చీకటిమయం చేసింది. కంట్లో ఆముదం చుక్కలు వేసి నొక్కడంతో చూపు కోల్పాయాడు. తర్వాత తల్లిదండ్రులు దూరమై... గ్రామంలోనే ఇంటింటికీ తిరుగుతూ పెట్టింది తింటూ జీవించాడు. కొన్నేళ్ల తర్వాత ఊరి ప్రజలు పట్టించుకోలేదని గ్రామానికి దూరంగా వెళ్లిపోయాడు.
యాచనతోనే సాగెను జీవన నావ...
గ్రామంలో ఏమీ దొరక్క రైల్వేస్టేషన్‌లో యాఛనతో జీవనం సాగించాడు. అంధుడు కావడంతో మోసం చేసే వాళ్లే ఎక్కువయ్యారు. అవి భరించలేక పస్తులుండ లేక తిరిగి గ్రామానికి చేరుకున్నాడు.
ఆర్జీలు పెట్టుకున్నా రాలేదు...
వందశాతం దివ్యాంగుడైన రాజారావు పింఛన్ కోసం చేయని ప్రయత్నం లేదు. ఎన్నిసార్లు ఆర్జీలు పెట్టినా అధికారుల్లో చలనం రాలేదు. ఇప్పటికైనా స్పందించి పింఛను మంజూరు చేయాలని రాజారావు కోరుతున్నాడు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉన్న రాజారావుకు పింఛన్ ఇప్పించి అండగా నిలబడాలని గ్రామస్తులు కోరుతున్నారు