తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని కోరుతూ ...సుబ్బారావు అనే వ్యక్తి వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రస్తుతం ఎల్ 1, ఎల్2, ఎల్ 3 కేటగిరీల్లో వీఐపీలకు దర్శనాలు కల్పిస్తున్నారని.. కోర్టుకు పిటీషన్ తరపు న్యాయవాది ఉమేష్ తెలిపారు. ఎల్1, ఎల్2,ఎల్3 దర్శనాలపై తితిదే స్టాండింగ్ కౌన్సిల్ ను వివరణ కోరటంతో పాటు... పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారంకు ధర్మాసనం వాయిదా వేసింది.
ఇవీ చదవండి...కరకట్ట ఆక్రమణల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం