తమ పార్టీని భాజపాలో విలీనం చేసే అధికారం.. కమలం గూటికి చేరిన ఎంపీలతో పాటు మరెవరికీ లేదని తెలుగుదేశం పార్టీ సీనీయర్ నేతలు వర్లరామయ్య, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూలు ప్రకారం ఈ చర్య కుదరదని వ్యాఖ్యానించారు. అలాంటప్పడు ఉపరాష్ట్రపతి వెంకయ్య వారి విలీన లేఖను ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మారారని.... ఒక్క క్షణం కూడా వారు ఎంపీలుగా కొనసాగడానికి వీల్లేదని మండిపడ్డారు.
ఇదీచదవండి