మధ్యప్రదేశ్ భోపాల్లో 40ఏళ్ల కిందట ఆ రాష్ట్ర ప్రభుత్వం శారదా మాతా మందిర నిర్మాణానికి కొంత స్థలాన్ని కేటాయించింది. నాడు అక్కడ స్థిరపడిన తెలుగువారు, అధికారులు కలిసి చిన్న ఆలయాన్ని నిర్మించారు. కాలం గడిచే కొద్దీ మందిరానికి భక్తుల ఆదరణ, ప్రతిష్ట పెరగడంతో తెలుగు సాంస్కృతిక పరిషత్ భోపాల్ వారు పునః నిర్మాణం చేశారు. జూన్ 13 నుంచి 16 వరకూ పునఃప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తున్నారు. ఆగమ సంప్రదాయం ప్రకారం తితిదే అర్చకులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు, దక్షిణ భారత సంప్రదాయాల మేళవింపుగా ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు రెండు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.
ఇది కూడా చదవండి.